తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ప్రత్యేక అధికారి
VZM: జిల్లా ప్రత్యేక అధికారి రవి సుభాష్ పట్టంశెట్టి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్‌తో కలిసి బుధవారం కొత్తవలస మండలంలో పర్యటించి, తుఫాన్ నష్టాలను పరిశీలించారు. ఆనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను సందర్శించారు. ఫిర్యాదుల నమోదు, రిజిస్టర్ల నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది విధులు, హాజరు పట్టికను తనిఖీ చేశారు.