ఒక్క ఓటరు పేరు కూడా తొలగించలేదు: సీఈసీ
పశ్చిమబెంగాల్‌లో అర్హత గల ఒక్క ఓటరు పేరు కూడా తొలగించలేదని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం పశ్చిమ బెంగాల్‌లో సీఈసీ బృందం పర్యటించింది. ఈ నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ మాట్లాడారు. బెంగాల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని హామీ ఇచ్చారు. కాగా, సీఈసీ బృందం రెండు రోజులుగా బెంగాల్‌లో పర్యటించింది.