'ఆత్మరక్షణకు కరాటే ఆయుధం'
VSP: ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు చోడే పట్టాభిరాం అన్నారు. ఆదివారం ఉషోదయ జంక్షన్ కార్యాలయంలో 'ఛాంపియన్స్ కప్ 2.0' విజేతలను ఆయన సత్కరించారు. షాడో ఫైటర్స్ కరాటే డోజో విద్యార్థులు కాటా, క్యూమిటే విభాగాల్లో పతకాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు.