VIDEO: 'త్యాగధనుల స్పూర్తితో దేశభక్తిలో ముందుకు వెళ్దాం'

E.G: త్యాగధనుల స్పూర్తితో దేశభక్తిలో యువత ముందుకు నడవాలని జనసేన పార్టీ కొవ్వూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు కూడదారి నవ్య అన్నారు. కొవ్వూరు జనసేన కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు డేగల రాము ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇవాళ జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం వృద్దులకు దుస్తులు పంపిణీ చేశారు.