ఈ నెల 12న అంగన్వాడీల ఆందోళన
చిత్తూరు: అంగన్వాడీల డిమాండ్‌లు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని యూనియన్ లీడర్ సరస్వతి తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పులిచెర్లలో సీడీపీవోకు అందజేశారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు, మెడికల్ లీవ్ ఇవ్వాలని, పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు.