బెలుగుప్పలో ఎరువుల దుకాణాల తనిఖీ

ATP: బెలుగుప్పలోని ఎరువుల దుకాణాలను రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ అధికారులు ఉమ్మడిగా శనివారం తనిఖీలు నిర్వహించారు. తహశీల్దార్ అనిల్ కుమార్, వ్యవసాయాధికారి పృథ్వి సాగర్, ఏఎస్ఐ రామదాసు తదితరులు స్టాక్ రికార్డులను పరిశీలించారు. MRP ధరలకే ఎరువులను విక్రయించాలని దుకాణాదారులను ఆదేశించారు.