వైరా నియోజకవర్గంలో వరలక్ష్మి వ్రత పూజలు

KMM: వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి), ఏన్కూరు, వైరా, కొణిజర్ల, జూలూరుపాడు మండలాల వ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇళ్లలోనే లక్ష్మీదేవిని అలంకరించి నగదు, బంగారు ఆభరణాలను హారాలుగా చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాయినాలు సమర్పించారు. పెద్దవారి నుంచి ఆశీర్వాదాలు స్వీకరించారు.