పాలకొండ- శ్రీకాకుళం ప్రధాన రహదారి పై గుంతలు

SKLM: బూర్జ మండలం లక్కుపురం జంక్షన్ సమీపంలో పాలకొండ- శ్రీకాకుళం ప్రధాన రహదారిపై గుంతలు వలన వాహనదారులకు అసౌకర్యం కలుగుతుంది. వర్షాలు కురిస్తే రోడ్డుపై నీరు చేరి గుంతలు కానరాక అందులోనే వాహనాదారులు ఇరుక్కుపోతున్నారు. దీంతో వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.