భగ్గుమంటున్న కూరగాయల ధరలు

మేడ్చల్: ఉప్పల్ పెద్ద మార్కెట్లో కూరగాయల ధరలు మళ్లీ పెరిగాయి. కిలో బెండకాయ రూ.80, దోసకాయ రూ.60, బీట్ రూట్ రూ.40, టమాట రూ.60, బీన్స్ రూ.100, వంకాయ రూ.80 గా ఉంది. అనేక కూరగాయలు రేట్లు కిలో రూ.80 కి చేరింది. ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కూరగాయల సరఫరా తగ్గటమే ఇందుకు కారణంగా వ్యాపారాలు చెప్పుకొస్తున్నారు.