మంత్రిని కలిసిన టీఎన్‌టీయూసీ అధ్యక్షులు

VZM: అప్పన్నపాలెంలో ఉన్న జిందాల్ కంపెనీ మూతపడడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఈమేరకు టీఎన్‌టీయూసీ అధ్యక్షులు లెంక శ్రీను కార్మికుల అవస్థలు దృష్టిలో పెట్టుకొని విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కార్మికులతో కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి దృష్టిలో పెడతానని హామీ ఇచ్చారు.