గ్రంథ పఠనంతో ఉన్నత స్థితి

గ్రంథ పఠనంతో ఉన్నత స్థితి

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలోని తృతీయ శ్రేణి శాఖ గ్రంథాలయంలో సోమవారం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించారు. గ్రామ ప్రముఖులు బీ. కోటేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రంథాలయాలలో పుస్తక పఠనం ద్వారా ఎందరో మహానుభావులు ఉన్నత స్థితికి ఎదిగిన విధానం సోదాహరణంగా వివరించారు. గ్రంథాలయ అధికారి పీవీవీ పద్మజ వివిధ గ్రంథాలను వివరించారు.