వేసవి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
VKB: వేసవి కాలంలో గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దొంగతనాలు జరగకుండా గ్రామస్థులు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం అన్నారు. ఊరికి వెళ్లే సమయంలో పొరుగువారికి చెప్పడంతో పాటు విలువైన బంగారం, వెండి నగలు, నగదు ఇంట్లో కాకుండా బ్యాంక్లో భద్రపరచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.