VIDEO: బాల్య వివాహాలపై అవగాహన ఫ్లెక్సీలు
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో మహిళా, శిశు సంక్షేమ శాఖ బాల్య వివాహాలపై విద్యార్థినులలో అవగాహన కలిగించేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం 18 ఏళ్ళ లోపు బాలికలకు వివాహం నిషిద్ధం అని, దీనిని అతిక్రమిస్తే కఠిన జైలు, జరిమానా శిక్షలు ఉంటాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్య చంద్ర రావు గురువారం తెలిపారు.