నాగార్జున సాగర్ - శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం
NLG: నాగార్జునసాగర్ నుండి కృష్ణానదిపై శ్రీశైలం వైపు లాంచీ ప్రయాణాన్ని శనివారం తెలంగాణ టూరిజం వాటర్ ఫ్లూయిట్ జనరల్ మేనేజర్ మాన్వి జెండా ఊపి ప్రారంభించారు. గత వారం ప్రారంభం కావాల్సిన ఈ ప్రయాణం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. సుమారు 30 మంది ప్రయాణికులతో లాంచీ నాగార్జున సాగర్ నుంచి బయలుదేరి సాయంత్రానికి శ్రీశైలానికి చేరుకుంది.