ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో
ADB: బోథ్ గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం బోథ్ ఎంపీడీవో రమేష్ పరిశీలించారు. కందకాల పనుల కొలతలను తీసుకున్నారు. ఎన్ఎంఎంఎస్ ద్వారా హాజరు విధానం తెలిపి, అలాగే నాలుగు గంటలు తప్పనిసరి పనిచేయాలని సూచించారు. పనులలో నాణ్యత ఉండాలని నీటి నిలువ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుటకు కృషి చేయాలని కోరారు. ఆయన వెంట ఏపీవో జగదేరావు ఉన్నారు.