'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించాలి'

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించాలి'

MBNR: అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రథమ మహాసభలు జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరై మాట్లాడుతూ.. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ సిఫార్సుల అమలు, రైతుల అప్పులను రద్దు చేయాలని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.