ఎన్నికల ప్రచారంలో భాగంలో సీపీఐ సమావేశం
SDPT: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోహెడ మండలంలోని గొట్లమిట్టలో సీపీఐ గ్రామశాఖ కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కనుకుంట్ల శంకర్, మండల కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్ మాట్లాడారు. గ్రామాల్లో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే నాయకులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శాఖ కార్యకర్తలు పాల్గొన్నారు.