కొప్పర్రులో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు
W.G: కొప్పర్రులో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. గ్రామసభలో గ్రామాభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలు, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాముఖ్యతపై విస్తృతంగా చర్చించారు. అనంతరం గ్రామానికి అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా పంచాయతీ కార్యదర్శి భవానిని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు.