ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్యాధికారి

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్యాధికారి

SRCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రజిత హనుమాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ప్రత్యేక వైద్య నిపుణులతో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాన్ని ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రజలందరూ ఈ ప్రత్యేక వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.