దుర్గంధంలో వెంకటపాలెం

దుర్గంధంలో వెంకటపాలెం

GNTR: తుళ్లూరు(M) వెంకటపాలెంలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. పంచాయితీ సమీపంలోని వాకింగ్ ట్రాక్ వద్ద ఉన్న చెరువులో గ్రామంలో ఉన్న చెత్త వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులోనే చెత్త వేయడంతో ఆ ప్రాంతం అంతా దుర్గంధం వెదజల్లుతుందని చెబుతున్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు వస్తాయని చర్యలు తీసుకోవాలని గురువారం ప్రజలు కోరుతున్నారు.