కాలేజీ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న అభివృద్ధి పనులను, క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులను శుక్రవారం పరిశీలించారు. అలాగే, క్లాస్ రూమ్స్‌ను పరిశీలించి, అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.