దేవరకద్రలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

దేవరకద్రలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

MBNR: దేవరకద్ర మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌లో మొత్తం 12 వార్డులలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అధికారుల వివరాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట వరకు 66.13 శాతం పోలింగ్ నమోదైంది. మిగిలిన గంటల్లో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.