ALERT: ప్రిలిమినరీ 'కీ' విడుదల

ALERT: ప్రిలిమినరీ 'కీ' విడుదల

TG: ట్రాఫిక్ సూపర్‌వైజర్, మెకానికల్ సూపర్‌వైజర్ పరీక్షల ప్రిలిమినరీ కీని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రిలిమినరీ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలపై ఈనెల 7వ తేదీ సా.5 గంటల వరకు సూచనలు ఇవ్వాలని కోరింది. ప్రతి అభ్యంతరానికి రూ.500 ఫీజుగా నిర్ణయించింది. కాగా గత నెల 29న పరీక్షలు నిర్వహించింది.