పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఇవాళ తాడికొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ MLA తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని, కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రతి సభ్యుడు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.