పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమానత్వం, విద్య, బడుగు వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఎన్టీఆర్ మండల వ్యవస్థ, రిజర్వేషన్లతో బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.