వైభవంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అభిషేకం

వైభవంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అభిషేకం

చిత్తూరు: నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం అభిషేకం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం చివరి శుక్రవారం కూడా కావడంతో అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం ఘనంగా నిర్వహించి, పట్టు వస్త్రాలు పూలమాలలతో ఘనంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రూపేష్ క్రిష్ణ ఆచార్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు.