VIDEO: వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించిన సినీ హీరో
HNK: తెలుగు సినీ నటుడు, హీరో సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ గురువారం హన్మకొండ నగరానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. అలాగే తన కుటుంబంతో కలిసి రుద్రేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు సినీ అభిమానులు, స్థానికులు ఆసక్తి కనబరిచారు.