'నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి'

'నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి'

కోనసీమ: నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మండపేట పురపాలక సంఘం ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పేర్కొన్నారు. పట్టణం 28వ వార్డులో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులను ఛైర్మన్ దుర్గారాణి శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.26 లక్షలతో డ్రైన్ నిర్మాణ పనులను పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టినట్లు తెలిపారు.