ఏయూ స్నాతకోత్సవానికి ఏపీ గవర్నర్‌

ఏయూ స్నాతకోత్సవానికి ఏపీ గవర్నర్‌

VSP: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈనెల 24న విశాఖ పర్యటనకు రానున్నారు. రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకుని హోటల్‌లో బస చేస్తారు. 25న ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని, మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారు. అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.