బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

NGKL: ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు. అర్చకుల వేదమంత్రోచ్చరణాల మధ్య జ్ఞాన సరస్వతి అమ్మవారికి మంత్రి కుంకుమార్చన, పుష్పార్చన ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.