దారుణ హత్య చేసిన దొంగ బాబా

దారుణ హత్య చేసిన దొంగ బాబా

సంగారెడ్డి: పూజలు చేస్తానని నమ్మించి ఓ మహిళను హత్య చేసిన దొంగ బాబా నర్సింగ్ రామ్ అలియాస్ శివను జిన్నారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరన్నగూడెంకు చెందిన బుచ్చమ్మ(60)ను పూజలు చేస్తానని నమ్మించి ఘట్కేసర్ పరిధిలోని మాదారం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, బంగారు గొలుసు కోసం బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. ఇంతకుముందు శివపై పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.