ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ

అన్నమయ్య: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ మాజీ రాష్ట్రపతి, మహానుభావుడు, విశిష్ట విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.