న్యాయశాఖ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించిన జడ్జి

న్యాయశాఖ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించిన జడ్జి

NLG: జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం-2026 నూతన డైరీ క్యాలెండర్‌ను ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయ శాఖ ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలను జిల్లా అధ్యక్షుడు మాతంగి వీరబాబు, ప్రధాన కార్యదర్శి లతీఫ్ పాషాలు జిల్లా జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో జిల్లా పరిపాలన అధికారి కృష్ణ, గిరి పాల్గొన్నారు.