తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు..!
అన్నమయ్య: జిల్లా రెవెన్యూ అధికారి కె. మధుసూదన్ రావు ఇవాళ కే.వీ.పల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డుల పరిశీలన, భూసంబంధిత దరఖాస్తులు, ధృవపత్రాల జారీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై వివరాలు సేకరించారు. సిబ్బంది పనితీరును పరిశీలించి, ప్రజా సేవల్లో వేగం, పారదర్శకత పాటించాలని సూచించారు.