VIDEO: అంగన్వాడీ లేక.. పౌష్టికాహారం అందాకా
ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి కొలాంగూడలో సుమారు 15 మంది గిరిజన కొలం ఆదివాసీ చిన్నారులు ఉంటారు. ఊరిలో అంగన్వాడీ భవనం ఉన్నా.. కొన్ని సంవత్సరాల నుంచి అది మూతబడి ఉండడంతో పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. చదువుల కోసం వారు లంబాడి తండాకు కాలినడకన వెళ్లాల్సి వస్తుందని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు.