పురుగుమందు తాగి బాలుడు ఆత్మహత్యాయత్నం

పురుగుమందు తాగి బాలుడు ఆత్మహత్యాయత్నం

EG: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ బాలుడు పురుగుమందు తాగిన ఘటన గోపాలపురం మండలం రాజంపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం పనికి వెళ్లి అక్కడి వారితో గొడవపడి ఇంటికి వచ్చిన బాలుడిని తల్లిదండ్రులు మందలించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, వైద్యులు ప్రథమ చికిత్స అందించి పరిశీలనలో ఉంచారు.