సూరారం సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం సూరారం సర్పంచ్‌గా అన్నవేని బానేష్, సమీప అభ్యర్థిపై 140 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన బానేష్ గెలుపొందడంతో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బాణేష్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.