బవుమాను చూసి నేర్చుకోండి: సునీల్ గవాస్కర్
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. భారత బ్యాటర్లు దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమాను చూసి నేర్చుకోవాలని సూచించాడు. అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కితాబిచ్చాడు. మంచి టెక్నిక్, అంకితభావంతో క్రీజులో పాతుకుపోయాడని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అయినా టీమిండియా బ్యాటర్లు ఆడి ఉండాల్సిందని పేర్కొన్నాడు.