ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ నిర్మాణాలపై ఎమ్మెల్యే సమీక్ష
ATP: సిరికల్చర్ కార్యాలయ ఆవరణంలో శంకుస్థాపన చేసిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణాలపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గురువారం ఏపీఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిన్న తరహా పరిశ్రమలకు అన్ని సౌకర్యాలు ఉండేలా, ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా దృష్టి సారించాలని ఆదేశించారు.