జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వీల్‌ఛైర్లు అందజేత
ATP: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో కంటే మెరుగైన సేవలు అందుతున్నాయని MLA దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. మీనాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 వీల్‌ఛైర్లు, మరో దాత ఆదిత్య ద్వారా మిల్క్ ఫీడింగ్ మిషన్లను ఆయన చేతుల మీదుగా ఆసుపత్రికి అందజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రి అభివృద్ధిపై దృష్టి సారించామని, త్వరలో రూ. 5 కోట్ల నిధులు రానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.