ఘనంగా వీడ్కోలు సమావేశం
SRCL: చందుర్తి మండలంలోని మరిగడ్డ ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఐదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మరిగడ్డ సర్పంచ్ దూది మనీషా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గొప్పగా చదువుకుని ఉన్నత విద్యావంతులై పాఠశాలకు మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.