పార్కుల్లో పచ్చదనంపై దృష్టి పెట్టాలి: కమిషనర్

GNTR: గుంటూరు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. ఉద్యోగ నగర్, విజయపురి, విద్యానగర్, నవభారత్ నగర్, పొన్నూరు రోడ్డు ప్రాంతాల్లో బుధవారం కమిషనర్ పర్యటించారు. పార్కుల్లో పచ్చదనం పెంపుతో పాటు, వాకింగ్ ట్రాకుల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు.