రైతులపై ఆర్థిక భారం

రైతులపై ఆర్థిక భారం

NZB: జిల్లాలో రైతులకు వరికోత యంత్రాలు భారం కానున్నాయి. సిరికొండ మండలంలో కురిసిన వడగళ్ల వానతోవరి పొలాలు బురదమయంగా మారాయి. సాధారణ హార్వెస్టర్లు దిగబడటంతో రైతులు తప్పనిసరిగా 'చైన్'యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. ఒక్కసారిగా కోత ధరలు పెరిగాయి. గంటకు రూ.2,800 వరకు చెల్లించాల్సి వస్తోందని, అదనపు ఆర్థిక భారం తమను కుంగదీస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.