శాంతి భద్రతల రక్షణకు ప్రత్యేక చర్యలు

MDK: వినాయక నవరాత్రి ఉత్సవాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పోలీసులను ఆదేశించారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జన వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.