క్రీడా ప్రాంగణాల్లో కరువైన సౌకర్యాలు

క్రీడా ప్రాంగణాల్లో కరువైన సౌకర్యాలు

KMR: లింగంపేట్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో సౌకర్యాలు కరువయ్యాయి. మండలంలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆయా గ్రామాల్లో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా క్రీడా ప్రాంగణాల్లో సౌకర్యాలు కరువు కావడంతో క్రీడాకారులు ప్రాంగణాలను ఉపయోగించుకోలేకపోతున్నారు.