ఆసుపత్రిలో నాణ్యతా ప్రమాణాలపై నేషనల్ కమిటీ పరిశీలన
VZM: చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, వైద్య సేవలపై నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ స్టాండర్డ్ కమిటీ నిన్న పరిశీలన జరిపింది. విశాఖపట్నం జిల్లా క్వాలిటీ కన్సల్టెంట్స్ డాక్టర్ ఆర్. భాస్కర్, కాకినాడ తాళ్లరేవుకు చెందిన నర్సింగ్ అధికారిని ఇవాంజెలిన్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ మేరకు ఆసుపత్రిలో అమలు జరుగుతున్న వివిధ పథకాలు, సౌకర్యాల గురించి ఆరా తీశారు.