జిల్లాలో యాసిడ్ దాడి కలకలం
VSP: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకంది. గాజువాక అక్కిరెడ్డిపాలెంలో ఎల్ఐసీ ఏజెంట్ అప్పారావుపై దుండగుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో అప్పారావుకు తీవ్ర గాయాలైయాయి. గమనించిన స్థానికులు అతని అస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. దాడికి గల కారణాలు, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.