నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే

MBNR: కోయిలకొండ మండలంలోని వీరంపల్లి గ్రామానికి చెందిన పసుల ఉషన్న ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ వారు రూ. 5లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. ఆ అమౌంట్‌ను ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి శుక్రవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.