రోడ్డుపై వరద పారుతున్న డ్రైనేజీ నీరు

SKLM: టెక్కలిలో శనివారం కురిసిన తేలికపాటి వర్షానికి పలు వీధుల్లో డ్రైనేజీలు నిండిపోయి మురుగునీరు వీధి రోడ్లపైకి చేరింది. ప్రధానంగా స్థానిక చిన్నచాకలివీధి, మండాపోలం కాలనీ, పాతజాతీయ రహదారి, రాందాసుపేట తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. మురుగు కాలువల్లో చెత్తాచెదారాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయడంతో వర్షం నీరు ఏటూ పారక ఈ పరిస్థితి ఏర్పడింది.