అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

TG: దేశ చరిత్రలో సన్న బియ్యం పథకం ఒక చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాల్లో గోదాముల ఏర్పాటుకై ప్రతిపాదనలు అందించాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. అన్ని రేషన్ షాపులలో సన్న బియ్యం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని.. నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.